|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 07:35 PM
నటి మృణాల్ ఠాకూర్ తన మాజీ ప్రేమికుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడితో బంధం ముగిసిపోయినందుకు తాను బాధపడలేదని, అతని మనస్తత్వం గురించి జాలిపడ్డానని తెలిపారు. ఫిబ్రవరి 20న విడుదల కానున్న 'దో దీవానే శహర్ మే' చిత్రం ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. తన దూకుడు, నటన తనకు నచ్చకపోవడమే బ్రేకప్‌కు కారణమని మాజీ ప్రేమికుడు చెప్పాడని, అలాంటి వారితో కొనసాగడం కష్టమని, భవిష్యత్తులో పిల్లలు కూడా అలాంటి భావనలతో పెరగడం తనకు ఇష్టం లేదని మృణాల్ పేర్కొన్నారు.
Latest News