|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 07:37 PM
విరాట్ కర్ణ కథానాయకుడిగా నటిస్తున్న 'నాగబంధం' చిత్రం టీజర్ మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న విడుదల కానుంది. అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న ఈ అడ్వెంచరస్ మైథలాజికల్ డ్రామాలో నభానటేశ్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. గుప్తనిధులు, వాటికి రక్షణగా ఉన్న కోబ్రాను పోస్టర్‌లో చూడవచ్చు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో విరాట్ కర్ణ సరసన టాలెంటెడ్ బ్యూటీస్ నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్ (కెజియఫ్ ఫేమ్) వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించి ఉన్నారు. సౌందర్ రాజన్ ఎస్ కెమెరా అద్బుతమైన విజువల్స్‌ని రాబడుతుందని, అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైన్ పురాతన ఆలయాల సెట్టింగ్స్‌ను కళ్లకు కట్టేలా నిర్మించారని, ఆర్‌సి ప్రణవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని టీమ్ ఇప్పటికే ప్రకటించి ఉంది. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను వేగవంతంగా జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ వేసవిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Latest News