|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 10:27 AM
నటి ఈషా రెబ్బా 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంలో తన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. .ఆ సినిమా కోసం చిత్ర యూనిట్ నన్ను సంప్రదిస్తే నటించేందుకు నేను ఆసక్తి చూపలేదు.మెయిన్ హీరోయిన్ గా చేయాలనీ వుంది అని చెప్పాను. అయితే ఈ సినిమాలో మీదీ ప్రధాన పాత్రే’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత నటించడానికి ఒప్పుకున్నాను. నాపై ఓ పాట కూడా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. కానీ, అది జరగలేదు.అయితే ఇంకొన్ని సీన్స్ ఎడిటింగ్‌లో తొలగించారు వీటికి కారణమేంటో నాకు తెలియదు.ఆ సినిమా విషయంలో మాత్రం బాధ ఉండేది. కానీ, ఎన్టీఆర్‌తో నటించడం, త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వర్క్ చేయడం ఆనందాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది.
Latest News