|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 10:33 AM
తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక ఉన్న అన్నామలై గిరిని అటవీశాఖ నిషేధం ఉన్నప్పటికీ, బుల్లితెర నటి అర్చనా రవిచంద్రన్, నటుడు అరుణ్ ప్రసాద్ అనుమతి లేకుండా ఎక్కి ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన అటవీశాఖ అధికారులు, ఇద్దరికీ రూ.5 వేల చొప్పున జరిమానా విధించి హెచ్చరించి పంపారు. పౌర్ణమి రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు.అనంతరం వారిని హెచ్చరించి పంపారు. అనుమతి లేకుండా గిరిపై వెళ్లడమే కాదు, ఇతరులను ఎక్కేలా ప్రోత్సహించినట్టు ఆరోపణలు ఉన్నాయి. నిషేధం గురించి ఆమె మాట్లాడటం వివాదాస్పదమైంది. నిషేధిత అటవీ ప్రాంతంలో అక్రమంగా ప్రవేశించి, ట్రెక్కింగ్ చేసినందుకు జరిమానా విధించినట్టు అధికారులు తెలిపారు. అరుణాచలం కొండ సత్యమంగళం టైగర్ రిజర్వ్‌కు చెందిన భవానీసాగర్ అటవీ ప్రాంతం పరిధిలోకి వస్తుంది. ఎవరైనా నిషేధం ఉల్లంఘించి, అక్రమంగా అడవిలోకి ప్రవేశించినా.. కొండను ఎక్కడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు చేశారు.
Latest News