|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 03:36 PM
సంక్రాంతి కానుకగా విడుదలై, విజయం అందుకున్న కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 4 నుండి తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలోనూ స్ట్రీమింగ్ కానుంది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. హీరో శర్వానంద్, హీరోయిన్లుగా సాక్షీ వైద్య, సంయుక్త, సీనియర్ నటుడు నరేశ్, సత్య, సునీల్, వెన్నెల కిశోర్ తమ కామెడీతో అలరించారు.ఈ సినిమా కథేంటంటే?: బీటెక్ చేసి ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్న కుర్రాడు గౌతమ్ (శర్వానంద్). నిత్య (సాక్షి వైద్య)తో ప్రేమలో ఉన్న తను.. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి పీటలెక్కాలని అనుకుంటాడు. ఈ పెళ్లికి తొలుత నిత్య తండ్రి రామలింగం (సంపత్ రాజ్) అడ్డు చెప్పినా.. తర్వాత అంగీకరిస్తాడు. ఆ పెళ్లి రిజిస్టర్ ఆఫీస్‌లో జరగాలని షరతు పెడతాడు. తప్పని పరిస్థితుల్లో దీనికి గౌతమ్ ఓకే అంటాడు. అలా పెళ్లికి దరఖాస్తు చేసుకున్నాక గౌతమ్‌కు ఓ అనుకోని చిక్కు ఎదురవుతుంది. దానికి, కాలేజీలో ప్రేమించిన దియా (సంయుక్త)కు ఉన్న సంబంధం ఏంటి? అసలు వాళ్లిద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ రెండు ప్రేమకథల వల్ల గౌతమ్ తండ్రి కార్తీక్ (నరేశ్) - పిన్ని పల్లవి (సిరి హనుమంతు)ల దాంపత్య జీవితం విడాకుల దాకా ఎందుకు వెళ్లింది? అన్నది మిగతా కథ.
Latest News