|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:01 PM
‘దురంధర్’ సినిమా ఓటీటీ విడుదలపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ సందర్భంగా దాదాపు 10 నిమిషాల సన్నివేశాలు తొలగించడమే కాకుండా కొన్ని డైలాగ్‌లను మ్యూట్ చేయడంపై ఫైర్ అవుతున్నారు. థియేటర్లలో ‘A’ సర్టిఫికెట్‌తో విడుదలైన సినిమాను ఓటీటీలో ఇలా కట్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దర్శకుడి విజన్‌ను దెబ్బతీసేలా నెట్‌ఫ్లిక్స్ వ్యవహరించిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కొన్ని సన్నివేశాలను పూర్తిగా కట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఏ-సర్టిఫికేట్ పొందినప్పటికీ, మళ్లీ సెన్సార్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఓటీటీలో అన్ కట్ వెర్షన్ చూడాలనుకున్నామని, ఇలా చేస్తే సినిమా సహజత్వం పోతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సినిమాలో 10 నిమిషాల సన్నివేశాలను కట్ చేయడంతో సినిమా ప్రవాహంపై ప్రభావం పడిందని చెప్పారు.పాకిస్తాన్‌లో భారత గూఢచార ఏజెంట్లు ఎలాంటి ఆపరేషన్లు చేస్తారు, భారత్‌పై దాడులకు పాకిస్తాన్ లోని మాఫియా, ఐఎస్ఐ, రాజకీయ నాయకుల నెక్సస్ ఎలా పనిచేస్తుందనే వివరాలను సినిమాలో చూపించారు. IC-814 విమాన హైజాక్ ఘటన, 2001 పార్లమెంట్ దాడి, ముంబై ఉగ్రదాడుల వంటి సంఘటనలు సినిమాలో ఉన్నాయి. డిసెంబర్‌లో విడుదలైన సినిమా ఇప్పటికీ థియేటర్లలో తన సత్తా చాటుతోంది. ధురంధర్ 2 మార్చి 19న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇదే రోజు యష్ ‘‘టాక్సిక్’’ సినిమా కూడా విడుదల కాబోతోంది.
Latest News