|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:04 PM
టాలీవుడ్ యువ నటుడు తిరువీర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'భగవంతుడు'. పల్నాడు నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్‌లోని విజువల్స్, తిరువీర్ పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జీజీ విహారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రవి పనస ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై రవి పనస నిర్మిస్తుండగా ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. రిషి నాగరాజు, కాలకేయ ప్రభాకర్, రవీంద్ర విజయ్, మురళిధర్ గౌడ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది.
Latest News