|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 02:01 PM
రాజాసాబ్ సినిమా ఫలితం కారణంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ పేరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ నడిపే విశ్వప్రసాద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో టాలీవుడ్‌లో నిర్మాతగా అడుగుపెట్టారు. మూడేళ్లలో దాదాపు 15 సినిమాలు నిర్మించినా, గూఢచారి, కార్తికేయ 2, ధమాకా, మిరాయ్ తప్ప మిగతావి ఆశించిన విజయం సాధించలేదు. ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం రాజాసాబ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.రాజాసాబ్ మూవీ అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్టు తెలుస్తోంది. మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. అయితే.. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తడబడడంతో.. ఈ మూవీ రైట్స్ ను ఫ్యాన్సీ రేట్‌కు దక్కించుకున్న జియో హాట్ స్టార్.. ఈ మూవీని ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ది రాజాసాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో అందర్లో క్యూరియాసిటీ నెలకొంది.
Latest News