|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:55 PM
మలయాళంలో విడుదలై విజయం సాధించిన 'జయ జయ జయ జయ హే'కి రీమేక్‌గా రూపొందిన చిత్రం ' ఓం శాంతి శాంతి శాంతిః'. ఏఆర్. సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే ఓటీటీలో మలయాళ మాతృకను అందరూ చూసేసిన తరువాత కూడా తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఇక ఈ రీమేక్ సినిమాలో తెలుగు ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? తెలుగు మేకర్స్ ఈ సినిమా విషయంలో చూపించిన కొత్తదనం ఏమిటి? అనేది సమీక్షలో తెలుసుకుందాం.. పెళ్లికి ముందు.. పెళ్లి తరువాత కూడా అమ్మాయిలకు, ఆడపిల్లలకు స్వేచ్ఛ, సమానత్వం,స్వాతంత్యం ఉండాలని కోరుకునే అమ్మాయి ప్రశాంతి (ఈషా రెబ్బా) అయితే చిన్నప్పటి నుంచి తండ్రి, మేనమామ, అన్నయ్య, అమ్మల సంరక్షణలో పెరిగి, తను అనుకున్న చదువును చదవలేక, కావాలిసిన దుస్తులు ధరించలేక పోతుంది. కనీం పెళ్లయ్యాక సంతోషంగా ఉండాలని, తను అనుకున్నట్లుగా జీవితాన్ని గడపాలని అనుకుంటే భర్త ఓంకార్ నాయుడు(తరుణ్ భాస్కర్) కూడా ఆమెపై అంక్షలు విధించడంతో పాటు, భార్య తన మాటే వినాలని, భార్య అంటే ఇంటికే పరిమిత కావాలని ఆయన భావించడంతో ఆమెకు జీవితంపై విసుగొస్తుంది. అంతే కాదు భర్త చేత రోజు చెంపదెబ్బలు తింటూ ఉండటం ఇష్టం లేక ప్రశాంతి భర్త ఓంకార్‌ను ఎదురిస్తుంది. ఎదురించడంతో పాటు ప్రశాంతి దగ్గరికొస్తేనే వణుకు వచ్చేలా ఆమె అతనిపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇప్పుడు భర్త ఓంకార్ నాయుడు ఏం చేశాడు? వీళ్లిద్దరి కాపురం ఎలా సాగింది? ఇద్దరు కలిసి ఉంటారా? విడిపోతారా? చివరికి జరిగిందేమిటి అనేది మిగతా కథ.
Latest News