|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 10:41 AM
గతేడాది 'ఆంధ్ర కింగ్' సినిమాతో నిరాశపరిచిన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్కా మీడియా బ్యానర్‌లో చేయాల్సిన భారీ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల రద్దయినప్పటికీ, రామ్ రెండు కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇద్దరు టాలెంటెడ్ దర్శకులు చెప్పిన వైవిధ్యమైన కథలను ఎంచుకున్న రామ్, ఈ రెండు సినిమాలు వేర్వేరు జోనర్లలో ఉంటాయని తెలుస్తోంది. ఈ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వారంలోనే వెలువడే అవకాశం ఉంది.ఇటీవల రామ్ నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాకు విమర్శకుల ప్రశంసలు, మంచి రివ్యూలు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఈ చిత్రాన్ని మహేష్ బాబు.పి దర్శకత్వం వహించగా, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. ఈ ఫలితం రామ్‌ను మరింత ఆలోచనాత్మకంగా మార్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి ట్రెండ్‌కు భిన్నంగా, స్పీడ్ పెంచి వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
Latest News