|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 10:44 AM
అందం, ప్రతిభ ఉన్నా లక్ కలిసిరాక వరుస ఫ్లాపులను ఎదుర్కొంటున్న భాగ్యశ్రీ, ప్రతి సినిమా నుంచి నేర్చుకుంటూ నటిగా మెరుస్తున్నారు. హిందీలో యారియన్ 2 సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత చందు ఛాంపియన్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం బ్యూటీ తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి.మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్, ఆంధ్రా కింగ్ తాలూకా వంటి చిత్రాలు ఆశించిన విజయం సాధించకపోయినా, ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దుల్కర్ సల్మాన్ సరసన 'కాంత' చిత్రం కొంత ఊరటనిచ్చింది. ప్రస్తుతం అఖిల్ అక్కినేని సరసన 'లెనిన్' చిత్రంలో నటిస్తున్న భాగ్యశ్రీ, తన డీసెంట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.