|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:53 PM
బాలీవుడ్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రేమ వ్యవహారం గురించి ప్రముఖ నిర్మాత శైలేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ‘ఫిరాఖ్’, ‘పేజ్ 3’ వంటి చిత్రాలను నిర్మించిన ఆయన, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారి బంధాన్ని ఒక ‘వయలెంట్ లవ్ స్టోరీ’గా అభివర్ణించారు. వారిద్దరి మధ్య ఉన్నది తీవ్రమైన ప్రేమ అని, రోమియో జూలియట్ కథ లాంటిదని పేర్కొన్నారు.గతంలో ఐశ్వర్య రాయ్ నివాసం వద్ద సల్మాన్ ఖాన్ అర్ధరాత్రి గొడవ చేశారన్న ఆరోపణలను శైలేంద్ర సింగ్ పరోక్షంగా ప్రస్తావించారు. "ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఉంటున్న బిల్డింగ్‌లోనే ఐశ్వర్య కూడా ఉండేవారు. ఆ సమయంలో సల్మాన్ అక్కడికి వెళ్లడం, జరిగిన గొడవ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఓ అవార్డు ఫంక్షన్‌కు ఐశ్వర్య నల్ల కళ్లద్దాలు పెట్టుకుని వచ్చారు. సల్మాన్ చాలా ప్యాషనేట్ వ్యక్తి, ఐశ్వర్య ఎంతో గౌరవప్రదమైన, హుందాగా ఉండే మనిషి" అని శైలేంద్ర వివరించారు. అయితే, ఆ ఘటన గురించి ఐశ్వర్య తనతో ఎప్పుడూ చర్చించలేదని, తాము అంత సన్నిహితులం కాదని స్పష్టం చేశారు. ఐశ్వర్య చాలా ప్రైవేట్ వ్యక్తి అని, ఆమె వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని సూచించారు.
Latest News