|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:04 PM
డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ 'మ్యాడ్' సినిమాతో టాలీవుడ్ యూత్‌ను ఆకట్టుకున్నారు. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వరుసగా సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన చేతిలో 'MAD జూనియర్స్' అనే టైటిల్‌తో ఒక హారర్ కామెడీ ప్రయోగం, అలాగే కోలీవుడ్ హీరో కార్తీతో ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయబోతున్నారనే వార్తలు ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సితార అధినేత నాగవంశీ ఈ కాంబినేషన్‌ను సెట్ చేసినట్లు సమాచారం. కళ్యాణ్ శంకర్ ముందుగా హారర్ కామెడీని మొదలుపెడతారా లేక కార్తీతో భారీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Latest News