|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 07:25 PM
బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన ‘ధురంధర్’ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. శుక్రవారం, జనవరి 30 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’లో ఈ సినిమా ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. కేవలం హిందీలోనే కాకుండా, దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.ఎలాంటి అంచనా ల్లేకుండా 2025 డిసెంబరు 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. తొలి షో నుంచే మౌత్ టాక్‌తో దూసుకెళ్లింది. సీక్రెట్ ఏజెంట్‌గా హీరో రణ్‌వీర్ సింగ్ లుక్స్, యాక్టింగ్, విలన్‌గా అక్షయ్ ఖన్నా పెర్ఫామెన్స్, పోరాటాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకు తగ్గట్టే ఈ చిత్రం వసూళ్ల రికార్డులు సృష్టించింది. దాదాపు రూ.1400 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘ధురంధర్’ రికార్డు నెలకొల్పింది. ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో ఉండగా, కేవలం ఒక్క భాషలోనే (హిందీ) విడుదలై, అత్యధిక వసూళ్లు సాధించిన రెండో మూవీగా రికార్డు సాధించింది. హిందీలో విడుదలైన కొన్ని రోజులకే తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరిగినా.. సాధ్యం కాలేదు. మరి ఓటీటీలో తెలుగు ఆడియో అందుబాటులో ఉంటుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
Latest News