|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 06:26 PM
టాలీవుడ్ నటుడు, రచయిత హర్షవర్ధన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'మనం' సినిమా కథా రచన వెనుక జరిగిన ఆసక్తికర ఘటనలను పంచుకున్నారు. మూడు తరాల కథను కలిపి రాయడం ఒక పెద్ద సవాలని, దర్శకుడు విక్రమ్ కుమార్ తనపై పెట్టుకున్న నమ్మకంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా కావడంతో, నాగార్జున స్క్రిప్ట్ విషయంలో రాజీ పడలేదని, కథను సాధారణ ప్రేక్షకులకు సైతం సులభంగా అర్థమయ్యేలా చేయడమే తన లక్ష్యమని హర్షవర్ధన్ వివరించారు.
Latest News