|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 10:40 AM
రామ్ చరణ్-ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. పాప, బాబు పుట్టారని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. కాగా ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు జూన్ 20, 2023న కూతురు క్లీంకార పుట్టిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరోకు ట్విన్స్ పుట్టారన్న విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.ఇప్పటికే ఈ జంటకు ‘క్లింకార’ అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబు కూడా పుట్టడంతో మెగా వారసుడు వచ్చాడంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గతంలో ఒక వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. తన ఇంట్లో అంతా ఆడపిల్లలే ఉన్నారని, ఒక మగపిల్లాడు ఉంటే బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన కోరుకున్నట్లే మనవడు, మనవరాలు ఇద్దరూ రావడంతో మెగా కుటుంబం పరిపూర్ణమైంది.2012లో వివాహం చేసుకున్న చరణ్-ఉపాసన దంపతులు, తమ జీవితంలోకి కొత్త అతిథులను ఆహ్వానించడం పట్ల సినీ ప్రముఖులు, మెగా అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు
Latest News