![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 08:47 PM
ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి ఇరవై రోజులు దాటింది. ఫిబ్రవరి 22వ తేదీన జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకుపోగా, నాలుగు రోజుల క్రితం ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన ఏడుగురిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.వారి జాడను గుర్తించేందుకు సింగరేణి రెస్క్యూ బృందాలు, ర్యాట్ మైనర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే, అన్వి రోబోటిక్స్, కేరళ క్యాడవర్ డాగ్స్ సహాయక బృందాలు నిత్యం శ్రమిస్తున్నాయి. ఏడుగురు ఉన్నట్లుగా భావిస్తున్న డీ-1, డీ-2 వద్ద తవ్వకాలు చేపట్టారు.