![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 10:38 AM
నగరంలోని జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు నంబర్-1లో ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 మీదుగా చెక్‌పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. కారు ఒక్కాసారిగా ఫుట్‌పాత్‌పైకి దూసుకురావడంతో రోడ్డుపై ఉన్న జనం ఒక్కసారిగా పరుగులు తీశారు. అయితే, ప్రమాదానికి కారణం కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని అక్కడున్న వారు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.