![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 11:23 AM
కన్న బిడ్డల్ని వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది ఓ మహిళ. జగిత్యాల(D) మల్లాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో సదరు యువతికి వివాహం జరిగింది. వీరికిద్దరు పిల్లలు ఉన్నారు. యువతి భర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో మరో వ్యక్తికి దగ్గరైంది. గురువారం యువతి తండ్రి అనారోగ్యంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఇద్దరు కుమారులను తీసుకుని వచ్చిన ఆ యువతి కుమారులను అక్కడే వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. అనాథలుగా మారిన ఆ పిల్లలను అమ్మమ్మ, తాతయ్య చేరదీశారు.