![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 11:46 AM
మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం హోలీ పండుగ పురస్కరించుకొని బోడుప్పల్ లోని చెంగిచెర్ల చిన్నక్రాంతి కాలనీలో కాలనీ వాసులు హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో రంగులు చల్లుతూ ఒకరికి ఒకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. హోలీ పండుగ లాగానే అందరి జీవితాలు రంగుల మాయం కావాలని కోరుకున్నారు.