![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 12:39 PM
శని అమావాస్యను పురస్కరించుకుని శని దేవాలయాలకు భక్తులు బారులు తీరారు. ఆదిలాబాద్ పట్టణంలోని పురాతన శని దేవాలయంలో నల్ల నువ్వులు, నూనెతో భక్తులు తైలాభిషేకం చేశారు. దోషాలు తొలిగిపోవాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నాలుగు గంటల నుండే భక్తుల తాకిడి ప్రారంభం కాగా, శనివారం అమవాస్య కలిసి రావడంతో ప్రత్యేకంగా భావించిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.