![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 12:43 PM
నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి అమీర్పేట్ -ఎస్ఆర్ నగర్ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది.బైక్పై వెళ్తున్న ఇద్దరిని అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. బైక్ను ఢీకొట్టిన వెంటనే ఆపకుండా వెళ్తున్న కారులో ఉన్న యువకులను స్థానికులు వెంబడించి పోలీసులకు అప్పగించారు. అయితే, వారు ఫుల్లుగా మద్యం సేవించి కారు నడుపుతున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు