|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 11:07 AM
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో,అలాగే ఆలేరు పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు పాల్గొన్నారు.యాదగిరిగుట్ట పట్టణంలోని 4,6,8వ వార్డుల్లో,అలాగే ఆలేరు పట్టణంలోని గౌడ సంఘ భవనం,బస్ స్టాండ్ పరిసరాల్లో,రైల్వే గేటు చౌరస్తా వద్ద భారీ జనసంద్రం మధ్య కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలేరు మరియు యాదగిరిగుట్ట పట్టణాల్లోని మున్సిపల్ వార్డుల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలలోకి వెళ్తే ప్రతి ఒక్కరూ ప్రజా పాలన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల సంతోషంగా ఉన్నారని అందుకే మరోసారి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారన్నారు. ఇప్పటికే యాదిగిరిగుట్టలో ఒక వార్డు కౌన్సిలర్ ని ఏకగ్రీవం చేసుకోవడం జరిగిందని, ఆ ఒక్క సీటే కాకుండా అన్ని సీట్లకు సంబంధించిన బి ఆర్ ఎస్ అభ్యర్థులు మాతో టచ్ లో ఉన్నారని బీర్ల ఐలయ్య గారు తెలిపారు.
ప్రజలల్లో ప్రభుత్వానికి,మాకు వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారని.. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు మహేందర్ రెడ్డి దొర అహంకారంతో మాట్లాడుతున్నారని మీకు పుట్టగతులు లేవని అన్నారు. మీకు ప్రజల్లో ఆదరణ ఉంటే ఎమ్మెల్యేలు,ఎంపీలు ఎమ్మెల్సీలు ,స్థానిక సంస్థల, ఎన్నికలలో, ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు రాబోయే రోజులలో మీకు గోరికట్టబోతున్నారని అన్నారు.ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా మా కొడుకు ఐలయ్య మీతోనే మేము అని ఆశీర్వాదం ఇస్తున్నారన్నారు.మీరు బిజెపి తో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని, మేము సేవలు చేసి ప్రజాపాలన అందిస్తూ ప్రజలను ఓట్లను అడుగుతున్నామని అన్నారు.గతంలో మేము ప్రజా ఆశీర్వాదంతో గెలిచిన ఎక్స్ అఫీషియో ఓట్లతో చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోని ప్రజాస్వామ్యాన్ని కూని చేసారని ఆరోపించారు. మరోసారి బీసీ బిడ్డనైన నాపై అనేకమైన ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు...