|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 11:18 AM
జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని జానకంపేట్ గ్రామ సీనియర్ బీ ఆర్ ఎస్ నాయకులు రాజు గారు, శ్రీహరి గారు ఈరోజు పటాన్ చేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా కాట మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి నాయకులను కాంగ్రెస్ వైపు నడిచేలా చేస్తుందన్నారు. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేసారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపాలిటీలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు