|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 11:24 AM
బీఆర్ఎస్ అభ్యర్థిగా భార్య పోటీ చేస్తుందని, భర్తను కానిస్టేబుల్ ఉద్యోగం నుండి సస్పెండ్. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ రెండవ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలాపురం గీతాంజలి అనే మహిళ. గీతాంజలి పోటీలో నిల్చుందని ఆమె భర్త రమేష్‌ను కానిస్టేబుల్ విధుల నుండి సస్పెండ్ చేస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు. తన భర్త ఎలాంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని.. డీసీపీ తిట్టినందుకు కళ్ళు తిరిగి పడిపోయిన తన భర్తను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించామని, తాను పోటీలో నిల్చున్నందుకు తన భర్తను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన అభ్యర్థి గీతాంజలి. తన భర్తను విధుల నుండి సస్పెండ్ చేయడం కాంగ్రెస్ నాయకుల కక్షపూరిత చర్యల్లో భాగమని, వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన అభ్యర్థి గీతాంజలి