|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 03:59 PM
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారితో కలిసి ప్రముఖ సినీ హీరో సుమన్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకొని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేయాలని ప్రజలను కోరారు.సినీ హీరో సుమన్ ప్రజలతో మమేకమై మాట్లాడుతూ ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఆయన సందడితో ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది.ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో ప్రచారం విజయవంతంగా సాగిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.