by Suryaa Desk | Mon, Jan 06, 2025, 05:40 PM
ఎన్టీఆర్ అభిమానులను 'దేవర' కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ వసూళ్లనే రాబట్టింది. అయితే కంటెంట్ విషయంలో అభిమానులకు పూర్తిస్థాయి సంతృప్తి కలగలేదనే టాక్ బలంగానే వినిపించింది. అయితే ఈ విషయాన్ని లైట్ తీసుకున్న ఎన్టీఆర్, బాలీవుడ్ మూవీ 'వార్ 2'తో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాపై అదేస్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆగస్టులో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసే తెలుగు మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలా ఉంటుందనేది 'కేజీఎఫ్' .. 'సలార్' సినిమాలు నిరూపించాయి. ఎన్టీఆర్ కి కూడా ఒక రేంజ్ లో మాస్ ఇమేజ్ ఉండటం వలన, వీరి కాంబినేషన్ సంచలనం సృష్టించడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ఈ సినిమాకి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా వచ్చిన వార్తలతోనే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మైత్రీ - ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉంటుందట. ఒక కథానాయికగా రష్మిక, మరో కథానాయికగా రుక్మిణి వసంత్ కనిపంచనున్నారని చెబుతున్నారు. సంగీత దర్శకుడిగా రవి బస్రూర్ ను తీసుకున్నారని టాక్. ఈ నెల 3వ వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.
Latest News