by Suryaa Desk | Fri, Jan 10, 2025, 05:35 PM
ప్రముఖ నిర్మాత, తన తండ్రి అల్లు అరవింద్ పుట్టిన రోజు వేడుకలను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వినూత్నంగా నిర్వహించారు. పుష్ప కా బాప్ అంటూ అడవి, ఫైర్, ఎర్ర చందనం దుంగలతో స్పెషల్ థీమ్ కేక్‌ను రూపొందించారు. అరవింద్ కేక్ కట్ చేస్తున్న ఫొటోలను 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా బన్నీ పంచుకున్నారు.ఇక ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ లో అల్లువారి కుటుంబసభ్యులంతా పాల్గొన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. "మీ గొప్ప మనసుతో మా జీవితాలను చాలా ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు" అని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ అభిమానులు ఆయన తండ్రికి విషెస్ తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. అల్లు అర్జున్ హీరోగా ఇటీవల వచ్చిన 'పుష్ప-2: ది రూల్' మూవీ వసూళ్ల పరంగా రికార్డులు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ సినిమా.. తాజాగా అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన రెండో భారతీయ చిత్రంగా అరుదైన ఘనతను నమోదు చేసింది. రూ. 1830కోట్లకు పైగా వసూలు చేసిన 'పుష్ప2'.. 'బాహుబలి2'ను దాటేసి ఈ రికార్డును నమోదు చేయడం విశేషం.
Latest News