|
|
by Suryaa Desk | Sat, Dec 21, 2024, 07:33 PM
భారతదేశంలో తెలుగు సినిమాను ఏ లెవెల్లో సెలబ్రేట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన తెలుగు హీరోలకే కాకుండా ఇతర భాషల్లో హీరోస్ కి వారి కల్ట్ సినిమాలకి మన తెలుగులో నెక్స్ట్ లెవెల్లో సంబరాలు థియేటర్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో సినిమాని పండగలా జరుపుకుంటూ ప్రభుత్వానికి భారీ రెవెన్యూ కూడా మనవాళ్ళు అందిస్తుంటారు. అయితే ఈ సినిమాల పండుగలో ఒకోసారి కొన్ని అపశృతులు కూడా జరుగుతూ ఉంటాయి. హీరోల మీద అభిమానంతో ఫ్లెక్సీల కట్టే సమయంలో కరెంట్ షాక్ కొట్టడమో, తొక్కసలాటలు, టికెట్ బుకింగ్స్ అప్పుడు పోలీసుల లాఠీల దెబ్బలు ఇలాంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ మొన్న తెలంగాణాలో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 రిలీజ్ సమయంలో హైదరాబాద్ ఫేమస్ సింగిల్ స్క్రీన్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట తీరని విషాదం నెలకొల్పింది. కాగా ఈ నేపథ్యంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా ఓ బాలుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. మరి ఈ షాకింగ్ ఘటనని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకొని ఏకంగా అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి కొన్ని గంటల పాటు జైల్లో కూడా పెట్టింది. అల్లు అర్జున్ బయటికి వచ్చేసారు.. కానీ ఈ ఇష్యూ మాత్రం ఇప్పట్లో తేలేలా లేదని కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలంగాణలో ఇక బెనిఫిట్ షోస్ ఉండవు అని కన్ఫర్మ్ చేసేసారు. అలాగే టికెట్ ధరలు కూడా రెగ్యులేట్ చేస్తామని ప్రకటించడం ఇప్పుడు టాలీవుడ్ కి పెద్ద దెబ్బ అవుతుంది అని టాక్ నడించింది. కానీ ఇపుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి నుంచే హుకుం జారీ అయ్యింది. లేటెస్ట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసారు. తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇక ఇక్కడ ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండవు అని అలాగే టికెట్ ధరల హైక్స్ కూడా ఇచ్చేది లేదు అంటూ తేల్చేసారు. దీనితో ఈ నిర్ణయం ఇపుడు షాకింగ్ గా మారింది. మరి ఇదే అమలులోకి వస్తే రానున్న చిత్రాలకి తెలంగాణ మార్కెట్‌లో బరి దెబ్బ అని చెప్పక తప్పదు. మరి టాలీవుడ్ నిర్మాతలు ఈ సంచలన నిర్ణయం పట్ల ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ఆల్రెడీ ఈ సంక్రాంతికి వస్తున్న బిగ్ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ కోసం నిర్మాత దిల్ రాజు పెద్ద ప్లాన్ నే సెట్ చేసుకున్నట్టుగా టాక్ ఉంది. కానీ ఇంతలోనే డైరెక్ట్ సీఎం నుంచే అనౌన్స్‌మెంట్ రావడం అనేది ఆ సినిమాకి మాత్రమే కాకుండా రానున్న కొన్నేళ్ల పాటు టాలీవుడ్ సినిమాకే దెబ్బ అని చెప్పి తీరాలి. మరి ఈ ఊహించని ట్విస్ట్ కి ఎలాంటి ముగింపు పలుకుతుందో చూడాలి మరి.