by Suryaa Desk | Mon, Dec 23, 2024, 05:34 PM
కులమతాలు ఏవైనా లోక కళ్యాణమే ప్రతి ఒక్కరి అద్భుతం కావాలని కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ పేర్కొన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని రంగారెడ్డి కాలనీలో గల కర్మేల్ ప్రార్థన మందిరంలో ఆదివారం సేమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక సీఐ భూపాల్ శ్రీధర్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పాల్గొని క్రైస్తవ పెద్దలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కుల, మతాలకు ప్రాధాన్యతనిస్తుందన్నారు.
ఏసుక్రీస్తు లోక కళ్యాణం కోసం పాటుపడ్డారన్నారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజా ఆగిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు సుశాంత్, నాయకులు బురణ్ సురేష్, పాస్టర్ స్టీఫెన్, క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.