by Suryaa Desk | Mon, Dec 23, 2024, 05:46 PM
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వం గడిచిపోయిన సమయంలో కలిసి చదువుకున్న జ్ఞాపకాలు అతీతంగా, పూర్వ సమ్మేళనం ఆత్మీయత మర్చిపోకుండా స్థానిక సమయములో జ్ఞాపకాలు గుర్తుకొచ్చేలా మరపురాని జ్ఞాపకం నిలిచిపోవాలని ఉత్సాహభరితంగా జరుపుకున్న ఆత్మీయ సమ్మేళనం గుర్తుకు అతీతంగా 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు 25 సంవత్సరాల ముందు ఆటపాటలతో ఆనాటి ఉపాధ్యాయుల మధ్య గౌరవ సంప్రదింపుల క్రమశిక్షణతో ఆనాటి విద్యార్థుల మధ్య కలిసిమెలిసి చదువుకున్న జ్ఞాపకాలతో అందరూ కలిసి బుగ్గారం.
పాఠశాలలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించి అప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయులను పిలిపించి సన్మానించిన విద్యార్థులు విద్యార్థులందరూ చదువుకున్నప్పటి పూర్వజ్ఞాపకాలను పంచుకొని ఆనందాల మధ్య కార్యక్రమాన్ని పాలు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అప్పుడు చదువుకున్న 50 మంది విద్యార్థులు ఉపాధ్యాయుకు సన్మానం చేసి సంతోషాలు పంచుకోవడం జరిగింది.