![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 04:14 PM
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగింది. పనులు కావాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 30 శాతం కమీ షన్లు చెల్లించాలనే ప్రచారం జరుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సభలో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మీలాగా బరితెగించి రాజకీయాలు చేయడం లేదు. కాంట్రాక్టు బిల్లులు ఇవ్వకుండా పోయింది ఎవరు? ఇప్పుడొచ్చి అడ్డగోలుగా మాట్లాడుతున్నారా? చర్చ వాస్తవంగా జరగాలే తప్ప పక్కదారి పట్టించేలా ఉండకూడదు’’ అని అన్నారు. ఈ క్రమంలో.. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి అని ప్యానెల్ స్పీకర్‌ను కోరారు. అయితే.. భట్టి వ్యాఖ్యలను ఖండించిన బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కేటీఆర్‌ను తాను విమర్శించలేదన్న భట్టి.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మాత్రమే అన్నానని, అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించలేదని భట్టి వివరణ ఇచ్చారు. అయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభ్యుల ోటాపోటీ నినాదాలు కొనసాగాయి. భట్టి వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ ఎంట్రీ 4 మెట్ల మీద కూర్చుని ‘‘వద్దు రా నాయనా ఈ 30 శాతం కమిషన్ ప్రభుత్వం’’ అంటూ బయట నినాదాలు చేశారు. ఈ క్రమంలో మార్షల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.