|
|
by Suryaa Desk | Sun, Nov 16, 2025, 06:57 PM
వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని చేపట్టి ప్రజలను చైతన్యపరిచి రిజర్వేషన్ సాధించుకోవాల్సిన అవసరం బీసీ నాయకులపై ఉందని ఆదివారం శాసన మండలి సభ్యులు, డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ కోరారు. రిజర్వేషన్ సాధన కోసం బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బీసీ నాయకులు తిరుమలగిరి అశోక్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ, బీసీలకు 42% రిజర్వేషన్ పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, మండలిలో తీర్మానం చేసిందని, కేంద్ర ప్రభుత్వానికి బిల్లు కాపీ పంపడం జరిగిందని చెప్పారు.