|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 04:04 PM
నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. తనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమని, అయితే ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని తెలిపారు. తన పిల్లల కోసమే సమయం కేటాయిస్తున్నానని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానో రానో చెప్పలేనని అన్నారు. చిన్నాన్న విజయసాయిరెడ్డి తనను, పిల్లలను బాగా చూసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.మూడేళ్ల క్రితం లోకేష్ బాబు చేపట్టిన ‘యువగళం పాదయాత్ర’లో కుప్పకూలిన తారకరత్న.. దాదాపు 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి.. గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. తారకరత్న చనిపోయేనాటికి ఆయన వయసు 39 ఏళ్లు కాగా.. ఆయనకి భార్య అలేఖ్య రెడ్డితో పాటు.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలేఖ్య రెడ్డికి పెళ్లై విడాకులు తీసుకుని ఉండగా.. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తారకరత్న. ఆ వివాహంతో నందమూరి ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడంతో.. అలేఖ్య రెడ్డిని కోడలిగా అంగీకరించలేదు.