|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 07:22 PM
గత సోమవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉగాది, శ్రీరామనవమి పండుగలు తేదీల నిర్ణయానికి కోసం నిర్వహించిన పట్టణ ప్రముఖులు, వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు హాజరవ్వడం అందరికీ విధితమే... ఆరోజు మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహణ కోసం BRS పార్టీ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి #పృథ్వీరాజ్ గారు 1,51,000/- తన వంతు విరాళం ప్రకటించారు.ఆ మొత్తాన్ని ఈరోజు ఉదయం రామ మందిరంలో ఆలయ నిర్వాహకులకు అందజేయడం జరిగింది. గత 45 సంవత్సరాలుగా పట్టణ పెద్దలు కొనసాగిస్తున్న ఆచార సాంప్రదాయాలను తాను కూడా తర్వాతి తరం నాయకులతో సమన్వయం చేసుకొని ఖచ్చితంగా కొనసాగిస్తానని సమాజం అంతా ఒకే తాటిపై నిలిచి అన్ని పండుగలను జరుపుకునే విధంగా ముందుకు తీసుకెళ్తానని మళ్లీ ఒకసారి స్పష్టం చేశారు.