|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 02:32 PM
యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం గ్రామంలో రైతులకు మెరుగైన విద్యుత్ సౌకర్యం అందించేందుకు నిర్మించిన నూతన కరెంట్ సబ్‌స్టేషన్‌ను ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ప్రారంభించారు.ఈ సబ్‌స్టేషన్ ప్రారంభంతో తాళ్లగూడెం,బహుపేట,మాసాయిపేట,ధర్మారెడ్డిగూడెం సహా సుమారు 15కు పైగా గ్రామాల రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది.దీని వల్ల రైతులు వ్యవసాయ బావులు,మోటార్లు సులభంగా నడుపుకుని సాగు పనులు సకాలంలో నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,విద్యుత్ శాఖ అధికారులు,స్థానిక నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.