|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 12:08 PM
బీసీ ల రాజకీయ అవకాశాలు, సామాజిక స్థితిగతులపై చర్చించిన ఖర్గే.ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలు మరింత బలంగా తీసుకెళ్లండి.కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ మీకు ఎల్లవేళలా ఉంటుంది..మధుజీ జన్మదిన ముబారక్ అంటూ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 14న తన జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం నీలం మధు ముదిరాజ్ ఢిల్లీ రాజాజీ మార్గ్ లోని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే నీలం మధును ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు. బీసీల సంక్షేమం, రాజకీయ అవకాశాలు, సామాజిక స్థితిగతులు, రానున్న రోజుల్లో పార్టీ, ప్రభుత్వ అవకాశాలపై చాలా సేపు ఆయన మాట్లాడారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుందని కొనియాడారు. ఎప్పటికప్పుడు ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్తూ ప్రజలతో మమేకం కావాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి నాయకుడికి పార్టీ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం నీలం మధు ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే ఆశీస్సులు తీసుకొని ధన్యవాదాలు తెలిపారు.