|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 07:10 PM
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చకలి చెరువు పునరుద్ధరణపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా బీఆర్ఎస్ యువ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ నాయకత్వంలో భారీ స్థాయిలో వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఆదర్శ్ నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలోని చకలి చెరువు వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన పొట్ట నరేందర్ యాదవ్ గారు చకలి చెరువు చారిత్రాత్మక ప్రాముఖ్యతను గుర్తుచేశారు. ఒకప్పుడు ఈ చెరువు చకలి (రజక) సమాజానికి జీవనాధారంగా ఉండేదని, వారు ఇక్కడే బట్టలు ఉతికి తమ జీవనోపాధిని సాగించేవారని తెలిపారు. అంతేకాకుండా గ్రామ ప్రజలు ఈ చెరువు నీటినే స్నానానికి ఉపయోగించేవారని, బతుకమ్మ పండుగ సమయంలో బతుకమ్మలను నిమజ్జనం చేసే పవిత్ర స్థలంగా కూడా ఈ చెరువు ఉపయోగించబడేదని ఆయన పేర్కొన్నారు.
కానీ ప్రస్తుతం చెరువు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై చెత్త, దుర్వాసన, దోమలతో నిండిపోయి ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగిస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిసర ప్రాంతాలైన పాపిరెడ్డి కాలనీ, గోపీనగర్, దోయెన్స్ కాలనీ, నెహ్రూ నగర్, ఆదర్శ్ నగర్, డ్యూబే కాలనీ ప్రజలు ఈ పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
చకలి చెరువును శుభ్రపరచి పునరుద్ధరించాలని పలుమార్లు ప్రభుత్వానికి, అధికారులకు వినతులు ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని పొట్ట నరేందర్ యాదవ్ గారు మండిపడ్డారు. వెంటనే చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎక్స్ కార్పొరేటర్ బొబ్బా నవతా రెడ్డి గారు, సందీప్ మద్దెల టీమ్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రాయల గారు, విజయ్ కుమార్ సానా గారు, శశి కిరణ్ గారు, రామకృష్ణ గారు, మల్లా రెడ్డి గారు, అల్లాదిన్ పటేల్ గారు పాల్గొన్నారు. అలాగే పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ శర్మ గారు, దొంతి చిన్న ముదిరాజ్ గారు, కృష్ణ యాదవ్ గారు, నవీన్ యాదవ్ గారు, సుభాష్ నాయక్ గారు, గుర్ల తిరుమలేశ్ గారు, నర్సింలు యాదవ్ గారు, ప్రతాప్ కుమార్ గారు, వాడే సీను గారు, హాజీ భాయ్ గారు, పాశం రాజు యాదవ్ గారు, అంధేళ సత్యనారాయణ గారు, హరి గుప్తా గారు, అలీ భాయ్ గారు, శంకర్ సేత్ గారు, మల్లేష్ గారు, ముజ్జు భాయ్ గారు, నితిన్ గారు, తిల్లూ గారు తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.