|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 06:53 PM
బిజెపి తెలంగాణ రాష్ట్ర స్పోక్స్ పర్సన్ శ్రీ రవికుమార్ యాదవ్ గారి నాయకత్వంలో నేడు శేరిలింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించాము. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ మరియు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము.నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పేదల హక్కుల కోసం పెద్ద ఎత్తున గళమెత్తాము. ఏళ్ల తరబడి ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేద ప్రజలకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ వేదికగా హెచ్చరించాము. పేదలకు సొంతింటి కల నెరవేరే వరకు మా పోరాటం ఆగదు.