|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 03:16 PM
ఈరోజు పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాంతంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు మరియు మహిళా దినోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, నియోజకవర్గం ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి , బిఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ కే చంద్రశేఖర్ రావు నాయకత్వంలో BRS ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేసిందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. రంజాన్ మాసం ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ K. Chandrashekar Rao గారి దూరదృష్టి నాయకత్వంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని, ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని తెలిపారు.నియోజకవర్గం ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి గారు మాట్లాడుతూ BRS పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలిచే పార్టీ అని, ప్రజల సంక్షేమమే పార్టీ లక్ష్యమని అన్నారు.ఈ సందర్భంగా BRS నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ గారు మాట్లాడుతూ BRS పార్టీ తెలంగాణ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని, K.Chandrashekar Rao గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సోమి రెడ్డి గారు, మెట్టు కుమార్ యాదవ్ గారు, ఎర్రోళ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తొంట అంజయ్య గారు, గడిల శ్రీకాంత్ గారు, తెలంగాణ ఉద్యమ నాయకుడు వెంకటేష్ గౌడ్ గారు, పాల్గొన్నారు.