|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 03:11 PM
అడోబ్ సంస్థ సీఈవో శంతను నారాయణ్ తన పదవి నుంచి తప్పుకోబోతున్నారు. దాదాపు 18 ఏళ్ల పాటు కంపెనీని విజయవంతంగా నడిపించిన ఆయన, ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే, కొత్త సీఈవో బాధ్యతలు చేపట్టే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత కూడా బోర్డు ఛైర్మన్‌గా కంపెనీకి తన మద్దతు అందిస్తారు.కొత్త నాయకుడిని ఎంపిక చేసేందుకు అడోబ్ బోర్డు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కంపెనీలో అంతర్గతంగా ఉన్నవారితో పాటు బయటి నిపుణులను కూడా ఈ పదవి కోసం పరిశీలించనున్నారు. శంతను నారాయణ్ నాయకత్వంలో అడోబ్ సాధించిన పరివర్తన అద్భుతమని, ఏఐ యుగంలో కంపెనీ విజయానికి ఆయన బలమైన పునాది వేశారని అడోబ్ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫ్రాంక్ కాల్డెరోనీ ప్రశంసించారు.