|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 02:58 PM
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం తోపుగని చెరువు గోదావరి జలాలతో నిండి అలుగు పోస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువు నిండేలా చేసి ప్రజలకు,రైతులకు నీరు అందించడం తమ లక్ష్యమని తెలిపారు.యాదగిరిగుట్ట పట్టణంలోని తోపుగాని చెరువు నిండడంతో పరిసర ప్రాంతాల చెరువులు కూడా నింపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.యాదగిరిగుట్ట నుండి వంగపల్లి,రామాజీపేట,తాళ్లగూడెం అదేవిధంగా 15కు పైగా గ్రామాలకు చెరువులు నింపి నీరు అందే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు.చెరువులు నిండడంతో రైతులకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.ప్రజలకు తాగునీరు,రైతులకు సాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగుతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు తెలిపారు.