|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 12:25 PM
పటాన్చెరు : జిన్నారం మున్సిపల్ పరిధిలోని మంగంపేట గ్రామంలో బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఖదిర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆత్మశుద్ధికి, క్రమ శిక్షణకు, దైవారాధనకు రంజాన్ పవిత్ర మాసం ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. శుక్రవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన నియోజకవర్గస్థాయి ఇఫ్తార్ విందును విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, షేక్ హుస్సేన్, మైనార్టీ మత పెద్దలు, సీనియర్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.