|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 04:12 PM
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. అయితే దేశంలో 90 రోజుల వరకు ఇంధన నిల్వలు ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అనవసర పుకార్లను నమ్మి ఇళ్లలో నిల్వ చేసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అధికారిక ప్రకటన విడుదల చేయాలని ఆయన కోరారు.అంతేకాదు ఆయిల్ కంపెనీల నుండి డీలర్లకు ఇప్పటివరకు ఉన్న క్రెడిట్ పేమెంట్ చేయాలని నిబంధనలు పెట్టారు. దీంతో డీలర్ల, ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయని.. ఈ అంశం పైన ఆయిల్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలన్నారు. ప్రభుత్వం ఆయిల్ కంపెనీలు డీలర్ల మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు ప్రతి సమాచారం అందుతుందన్నారు.