by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:23 PM
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కథతో రూపొందిన `స్కై ఫోర్స్` చిత్రం శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ మొదటి రోజున ₹11.25 కోట్లు (ఇండియా నెట్) వసూలు చేసింది. ముంబై, బెంగళూరు వంటి ప్రధాన మార్కెట్లలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది, సాయంత్రం, రాత్రి షోలకు ఈ ఆక్యూపెన్సీ పెరిగింది. హిందీ 2D వెర్షన్ మొత్తం లాభాలకు ఎక్కువగా దోహదపడింది. 1వ రోజు, ముంబైలో అత్యధిక ఆక్యుపెన్సీ నమోదైంది, తర్వాత బెంగళూరులో నమోదైంది.అయితే, 2వ రోజు (శనివారం), సినిమా కలెక్షన్లు ₹0.81 కోట్లకు (ఇండియా నెట్) పడిపోయాయి. దీంతో రెండు రోజుల మొత్తం ఆదాయం ₹12.06 కోట్లకు చేరింది. అయతే రెండో రోజు ఇంకా పూర్తి కాలేదు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనే ఈ క్లారిటీ పూర్తి లెక్కల రేపుగానీ తెలియదు. బట్ చూడబోతుంటే రెండో రోజే భారీగా తగ్గినట్టు అనిపిస్తుంది. 1వ రోజు, ముంబై వంటి ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ 26.75%గా ఉంది, సాయంత్రం, రాత్రి షోలు ముందంజలో ఉన్నాయి. NCR, బెంగళూరు వంటి ఇతర ప్రాంతాల్లో మిడిల్ రేంజ్‌లో ఆక్యుపెన్సీ నమోదైంది. మార్నింగ్ తో పోల్చితే కొంత పెరిగింది. `స్కై ఫోర్స్` సినిమాని అభిషేక్ అనిల్ కపూర్, సందీప్ కెవాల్ని దర్శకత్వం వహించగా, దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే, అమర్ కౌశిక్ నిర్మించారు. జనవరి 24, 2025న ఇది విడుదలైంది. ఇందులో అక్షయ్ కుమార్‌తోపాటు వీర్ పహారియా, సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటించారు.
Latest News