by Suryaa Desk | Sun, Dec 22, 2024, 02:54 PM
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ కు తెలంగాణ డీజీపీ జితేందర్ పరోక్షంగా హితవు పలికారు. హీరో కావచ్చు, మరెవరైనా కావచ్చు.. పౌరులు అందరూ బాధ్యతగా ఉండాలని చెప్పారు. ప్రజల ప్రాణాలు, భద్రత కంటే సినిమా ప్రమోషన్ ఎక్కువ కాదని అన్నారు. పోలీసులు వ్యక్తిగతంగా ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. ఈమేరకు ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రం ప్రారంభించి డీజీపీ మాట్లాడారు. ‘ఆయన సినీ హీరో కావొచ్చు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఘటనలు పౌరుల భద్రతకు మంచిది కాదు’ అని డీజీపీ జితేందర్ వ్యాఖ్యానించారు.