![]() |
![]() |
by Suryaa Desk | Sun, Mar 16, 2025, 02:21 PM
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖానాపురం మండలం పాకాల సరస్సు సమీపంలో ఆర్టీసీ బస్సు.. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ పారిపోయాడు.
దీంతో బస్సు డ్రైవర్‌కు అనుమానం వచ్చి ఆటోలో పరిశీలించగా.. ఆటోలో గొర్రె, అడవి పంది మాంసం బయటపడింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసుకొని.. మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాంసం అక్రమ తరలింపుపై దర్యాప్తు చేపట్టారు.