![]() |
![]() |
by Suryaa Desk | Sun, Mar 16, 2025, 02:26 PM
అసంబ్లి స్పీకర్ గడ్డం ప్రసాద్ ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేటీఆర్ ఏకవచనంతో సంబోదించడాన్ని నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ నేతలు మరికల్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కూడలిలో వారి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు విరన్న మాట్లాడుతూ. స్పీకర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల బిఆర్ఎస్ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని చెప్పారు.