![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 02:11 PM
తెలంగాణకు కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టొద్దని మొత్తుకున్నా సీఎం రేవంత్ రెడ్డి వినిపించుకోలేదని కేటీఆర్ విమర్శించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు మొరపెట్టుకోవడంపై కేటీఆర్ స్పందించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ కక్షగట్టి తెచ్చిన కరువు అని దుయ్యబట్టారు. ఎండిన ప్రతి ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాలని తేకపోతే రైతులతో కలిసి కాంగ్రెస్ సర్కార్ భరతం పడుతామని హెచ్చరించారు.