![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 02:55 PM
మహాదేవ్‌పూర్ PSలో నమోదైన FIRను కొట్టివేయాలంటూ KTR వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. మేడిగడ్డ బ్యారేజీపై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారంటూ కేసు నమోదు కాగా.. ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
మేడిగడ్డ నిషిద్ధ ప్రాంతంగా గుర్తిస్తూ కేంద్రం నుంచి నోటిఫికేషన్ వెలువడలేదని కేటీఆర్ తరఫు న్యాయవాది వాదించారు. రాజకీయ కక్షల కారణంగానే సెక్షన్లను మార్చారని కోర్టుకు వివరించగా.. తీర్పును కోర్టు రిజర్వు చేసింది.